హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ
భక్తులు,పుర ప్రముఖులు అధిక సంఖ్యలో అమ్మ వారి కళ్యాణాన్ని తిలకించారు.
బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మ వారి కళ్యాణ మహోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తిలకించారు. తదుపరి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా సీఎం కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు, కొండా సురేఖ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కుటుంబ సభ్యులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి, శాసనసభ్యులు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ ల రాకతో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో గౌరవ స్వాగతం పలికారు.
దేవాదాయ శాఖ అమ్మ వారి కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులు, పుర ప్రజలకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించడం జరిగింది.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ చైర్మన్ సాయిబాబా,కళ్యాణ మహోత్సవ నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. త్రాగునీరు విద్యుత్ నిరంతరంగా ఏర్పాటు చేపట్టారు. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అమ్మవారి కళ్యాణం తికలించేలా, దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేపట్టారు.
కళ్యాణం తదుపరి కూడా అమ్మవారిని దర్శించుకొనుటకు భక్తులు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా,డిసిపి ట్రాఫిక్ కాజల్ సింగ్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, ఈవో వినోద్ రెడ్డి, విద్యుత్ జిహెచ్ఎంసి, హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్, మెడికల్, రెవెన్యూ, దేవాదాయ శాఖ, పోలీస్ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
===================