అంజయ్యనగర్ భవన కూల్చివేత కేసులో బిల్డర్ అరెస్ట్ దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తుండగా షంషాబాద్‌లో పట్టుకున్న పోలీసులు
అర్జున్ సమాచారం: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న G+7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి బిల్డర్ సయ్యద్ సాజిద్ (39)ను రాత్రి రాయదుర్గం పోలీసులు షంషాబాద్‌లో అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 22న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో అంజయ్యనగర్‌లోని ప్లాట్ నంబర్ 113/131/1, సర్వే నంబర్ 135లో నిర్మాణంలో ఉన్న G+6 భవనం ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే....