అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్. – రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. – 08 చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్ట్

సూర్యాపేట: అర్జున్ సమాచారం: సూర్యాపేట జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలు, వైన్స్ షాపుల్లో మద్యం చోరీలు, వ్యవసాయ బావుల వద్ద సబ్‌మర్సిబుల్ మోటార్లు, కరెంట్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను ఆత్మకూర్ (ఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.20లక్షల విలువైన నగదు, బంగారు–వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ పరికరాలు, మద్యం సీసాలు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ...