అందుకు దేశ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న మోదీ ఈ స్థాయికి చేరుకుంటానని తాను ఎన్నడూ ఊహించలేదని వ్యాఖ్య ప్రజల నిరంతర ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందంటూ దేశ ప్రజలకు కృతజ్ఞతలు

అర్జున్ సమాచారం: దేశ ప్రజలే తనకు దైవ స్వరూపమని, వారి నమ్మకమే తన బలమన్న ప్ర‌ధాని 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా మొదలైన ఆయన ప్రస్థానం ప్రభుత్వాధినేతగా తాను నిరంతరాయంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకమే తనకు అతిపెద్ద బాధ్యత అని, తనపై ఈ దేశంలోని ప్రతి పౌరుడికీ గొప్ప హక్కు ఉందని ఆయన అన్నారు. నేడు ఢిల్లీలో జరిగిన 'వికసిత్ భారత్ సంకల్ప్...