ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 7:33 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్త నిరసనలు మల్లిఖార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
అక్టోబర్ 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రసీ మార్చ్ నిర్వహిస్తాం.  ప్రతి జిల్లా కేంద్రంలో మార్చ్ ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఇండి కూటమి సమావేశం తరువాత అయన మీడియాతో మాట్లాడారు.
డెమోక్రసి మార్చ్ లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తాం. అక్టోబర్ 6న సీఈసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఎంపీలంతా కలిసి సీఈసీ ఆఫీస్ను ముట్టడిస్తాం. అక్టోబర్ 2వ వారంలో రాష్ట్రపతిని కలుస్తాం. ఈసీని మోదీ, అమిత్ షా తోలుబొమ్మలా వాడుతున్నారు. అందుకే ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐదు భారీ సభలు నిర్వహిస్తాం. నవంబర్ 1న ఢిల్లీలో భారీ సభ నిర్వహిస్తామని అన్నారు.