అక్టోబర్ 27-30 మధ్య తీవ్ర తుఫాను హెచ్చరిక

విజయవాడ అక్టోబరు 22,అర్జున్ సమాచారం: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో అక్టోబర్ 23న (శుక్రవారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.థాయ్‌లాండ్ గల్ఫ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనానికి అనుబంధంగా ఈ వ్యవస్థ బలపడుతోంది. ఇది ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలి, ఆ తర్వాత...