అక్రమంగా పేలుడు పదార్థాల వినియోగం 99 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు
హుజురాబాద్,అర్జున్ సమాచారం: హుజురాబాద్ మండలం రంగాపూర్ శివారులోని హనుమాన్ స్టోన్ క్రషర్లో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. క్రషర్లో అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్ శివారులోని హనుమాన్ స్టోన్ క్రషర్లో ఎలాంటి అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు క్రషర్...