అటవీ విస్తీర్ణం పెంపుదల, కలప,జంతువుల స్మగ్లింగ్ అరికట్టడమే ధ్యేయం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్,అర్జున్ సమాచారం: శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ , జిల్లా అటవీ సంరక్షణ కమిటీ చైర్మన్  అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి , పోలీస్ అధికారులు,  కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో అడవుల సంరక్షణకు ,పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా కఠినమైన నిఘా...