అదితి గోక్షేత్రం ప్రారంభోత్స‌వంలో పాల్గోన్న స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్

వికారాబాద్,అర్జున్ సమాచారం: నవాబ్‌పేట మండలం వట్టిమీనపల్లి గ్రామంలోని గోవర్ధనగిరిపై నూతనంగా నిర్మించిన శ్రీ అదితి గోక్షేత్రం ప్రారంభోత్సవం, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాల దివ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్  పాల్గొన్నారు. అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య హస్తాలతో గోక్షేత్రం ప్రారంభం కాగా, స్వామీజీ వారి ఆశీస్సులను స్పీకర్  అందుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్  మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో గోమాతకు...