అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సిఎంఓ అధికారులతో కలెక్టర్, సిపి సమీక్ష

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్యూరిటీ అధికారులు, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హెలిప్యాడ్, నూతన కలెక్టరేట్ భవనం, కలెక్టరేట్ పరిసరాలను తనిఖీ చేశారు. సిపి,సీఎమ్ఓ అధికారులతో పర్యటనకు సంబంధించిన పలు విషయాలను చర్చించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో...