అపోలో రీచ్ హాస్పిటల్స్‌లో విద్యార్థులతో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
కరీంనగర్,జూలై 01,అర్జున్ సమాచారం : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని అపోలో రీచ్ హాస్పిటల్స్‌లో రావ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైద్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి, సమాజ ఆరోగ్య పరిరక్షణలో వారి సేవలను కొనియాడారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ డా. నాగ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల ఆహారం, వ్యాయామం,...