అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ రమ కమాన్ పూర్
కమాన్ పూర్,అర్జున్ సమాచారం: పాలకుర్తి మండలంలోని గన్ శ్యామ్ దాస్ నగర్ గ్రామ అభివృద్ధిలో భాగంగా సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ సూరరమ మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య ప్రారంభించారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం డి ఎం ఎఫ్ టినిధులు కేటాయించాలని గౌరవ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించి గ్రామానికి రూ.15 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులు మంజూరు చేశారు....