అమల్లోకి అనలాగ్ పన్నీరు
హైదరాబాద్, సెప్టెంబర్ 12,అర్జున్ సమాచారం: ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 'అనలాగ్' (కృత్రిమ) పన్నీర్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పన్నీర్ పేరిట విక్రయిస్తున్న నాణ్యత లేని, కల్తీ ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ఈ కఠిన చర్యలు చేపట్టింది.పన్నీర్ పేరుతో చలామణి అవుతున్న డైరీయేతర, కృత్రిమ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, పంపిణీ మరియు విక్రయాలపై ఈ...