అమెరికాలో తెలంగాణకు పెట్టుబడుల పిలుపు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

బాల్టిమోర్ (అమెరికా):అర్జున్ సమాచారం: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ జాతీయ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రవాస భారతీయులకు మాతృభూమికి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ముఖ్యాంశాలు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేసి, ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులకు...