అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలి.. రేవంత్ ప్రభుత్వానికి కవిత డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 05:అర్జున్ సమాచారం: ఖానామెట్‌లోని అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అందుకోసం రేవంత్ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నామన్నారు. అయ్యప్ప సొసైటీలో ఇల్లు కొని ఎవరూ నష్టపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ అయ్యప్ప సొసైటీలో రిజిస్ట్రేషన్లు ఉండవని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ సొసైటీలో 750 అక్రమ నిర్మాణాలు జరిగాయని వివరించారు. గురువారం హైదరాబాద్‌లో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడుతూ.. అయ్యప్ప సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని...