అర్నబ్ తుపాను నష్టంపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. తక్షణ సాయం కోరుతూ విజ్ఞప్తి అర్నబ్ తుపాను నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ న ష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి ప్రాథమిక అంచనాల ప్రకారం భారీగా పంట, ఆస్తి నష్టం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు ముందస్తు చర్యల కారణంగా ప్రాణనష్టాన్ని నివారించినట్టు వెల్లడి

విజయవాడ,అర్జున్ సమాచారం: ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుపాను చూపిన ప్రభావం, రాష్ట్రంలో వాటిల్లిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ నష్టం జరిగిందని, నష్టాన్ని అంచనా వేసేందుకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుపాను సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తుపాను తీవ్రత, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్...