అర్నబ్ తుపాను బాధితుల కోసం ఎస్‌బీఐ భారీ విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5.01 కోట్లు అందజేత సీఎం చంద్రబాబుకు చెక్ అందించిన ఎస్‌బీఐ ప్రతినిధులు విరాళంపై ఎస్‌బీఐకి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి

అమరావతి,అర్జున్ సమాచారం: అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు తమ వంతు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల 1 లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించింది. నేడు అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. తుపాను...