అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ & పీజీ కళాశాలకు జాతీయ స్థాయి “బెస్ట్ ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ డెవలప్‌మెంట్ అవార్డు–2026”
కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్‌కు చెందిన అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ & పీజీ కళాశాల జాతీయ స్థాయి "బెస్ట్ ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ డెవలప్‌మెంట్ – ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు– 2026"ను సొంతం చేసుకుంది. గురుగ్రామ్‌లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వూటుకూరి రవీందర్ రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు. ఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ భారత క్రికెటర్ సందీప్ పాటిల్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలు...