అదిలాబాద్,అర్జున్ సమాచారం:
అదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యలే అని టీఆరెస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. రిమ్స్ బాధితులను పరామర్శించిన తరువాత ఆమె మీడియాతోమట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానన్న ముఖ్యమంత్రి… మీరు దత్తత తీసుకున్న జిల్లాలో ఐదు మంది పసి పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా ? ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యలే. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం ఉంటోంది కానీ మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూసే టైమ్ కూడా లేదా? గత ఏడాది ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో 1500 మంది పిల్లలు చేరితే, వారిలో 204 మంది పిల్లలు చనిపోయారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని అమె మండిపడ్డారు.