ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యావెత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటి లండన్:
లండన్:అర్జున్ సమాచారం: తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లోవాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్కు...