ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు విద్యుత్ శాఖ సిబ్బంది మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

శంకరపట్నం :అర్జున్ సమాచారం: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి శంకరపట్నం మండలం తాడికల్‌ గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా విద్యుత్‌ శాఖకు చెందిన ఐదుగురు సిబ్బంది కారులో వరంగల్‌...