ఆటో డ్రైవర్ల సమస్యల పై ఐక్య పోరాటం

మంచిర్యాల,అర్జున్ సమాచారం: మంచిర్యాల పట్టణంలోని వివేకవర్ధిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హెచ్ఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఏ (RWA), బీఆర్టీయూ (BRTU), బీఎంఎస్ (BMS), 246 మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్, జేఏసీ ఆటో యూనియన్ తదితర ఆటో యూనియన్ల జిల్లా నాయకులు పాల్గొని, మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. నాయకులు మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలు అనంతరం ఆటోలకు గిరాకీ తీవ్రంగా తగ్గిపోయి వేలాది మంది ఆటో...