ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 3:04 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆత్మహత్య ప్రయత్నం చేసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం:                                                                                                                          జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణలో వున్న  ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఎర్రగడ్డ మోతీనగర్ లోని సోదరుడి ఇంట్లో ఆత్మహత్య యత్నం చేయడంతో ఎస్సార్ నగర్లోని హాస్పిటల్ కు  కుటుంబ సభ్యులు తరలించారు. ఆదివారం  కృష్ణారెడ్డిపై సహచర ట్రైనీ ఐపీఎస్ తనపై లైంగిక వేధింపులకు ఫిర్యాదు చేసింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు.  దీంతో తీవ్ర డిప్రెషన్ కు గురైన కృష్ణారెడ్డి, అదే స్థితిలో సోదరుడి ఇంటికి వెళ్ళి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. …!
======================