ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ మూవీ ప్రచారానికి శ్రీకారం..

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)” ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను పరిచయం చేయగా, అనంతరం శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయంగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో...