ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమా కాస్త ఆలస్యంగా రిలీజ్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "మూడు...