ఆదిలాబాద్, మామూనూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
అర్జున్ సమాచారం: తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కి విజ్ఞప్తి చేశారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని తెలిపారు. ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు...