ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్‌

ఆదిలాబాద్‌,అర్జున్ సమాచారం: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో నాలుగు వెంటిలేటర్లను చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన సజ్జన్‌, అభిజిత్‌ అనే ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్లమంటూ రిమ్స్‌లోకి ప్రవేశించి వెంటిలేటర్లను అపహరించినట్లు తెలిపారు. గత నెల 30న రిమ్స్‌ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆర్‌ఐసీయూ, చెస్ట్‌ వార్డుల నుంచి ఒక్కో వెంటిలేటర్‌, టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లు చోరీకి గురయ్యాయి. మొత్తం...