ఆదివాసి గ్రామాల్లో విద్యా వెలుగులు నింపుతున్న దానధర్మ ట్రస్ట్ చైర్మన్ ఘంటా రాధా ఆధ్వర్యంలో ఉచిత విద్య, మధ్యాహ్నం భోజనంతో చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వలస ఆదివాసి చిన్నారులకు విద్యాదానం గంటరాజ సేవలకు ప్రశంసలు…

భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం: అన్ని దానాల్లో విద్యాదానం మహోన్నతమైనది" అనే లక్ష్యంతో దానధర్మ ట్రస్ట్ చైర్మన్ ఘంటా రాధా ఆదివాసి గ్రామాల్లో విద్యా సేవలను విస్తరిస్తున్నారు. అశ్వాపురం మండలంలోని మావిళ్లవాయి–గుట్టబోరు ఆదివాసి గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలను నిర్మించి ప్రారంభించారు. నిరక్షరాస్యత అధికంగా ఉన్న వలస ఆదివాసి గ్రామాల చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ఉపాధ్యాయులను నియమించి ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు ప్రతిరోజూ ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తూ వారి పోషకాహార అవసరాలను కూడా తీర్చుతున్నారు. మౌలిక సదుపాయాలు లేని...