ఆపద మిత్ర శిక్షణతో సామాజిక సేవకు సిద్ధమైన వాలంటీర్లు
కరీంనగర్,అర్జున్ సమాచారం: ఆపద సమయంలో తక్షణమే స్పందించి ప్రాణాలను కాపాడేలా వాలంటీర్లను తీర్చిదిద్దడమే ఆపద మిత్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శిక్షణ లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్‌లో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహించిన వారం రోజుల శిక్షణలో విపత్తుల సమయంలో జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. 13వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్...