ఆపరేషన్ ముస్కాన్–XII ద్వారా 125 మంది చిన్నారుల రక్షణ – జిల్లా ఎస్పీస్నేహ మెహ్రా,

వికారాబాద్,అర్జున్ సమాచారం: జిల్లా వ్యాప్తంగా అన్నీ శాఖల సమన్వయం తో  ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, భిక్షాటన, విద్యకు దూరమైన చిన్నారులను గుర్తించి రక్షించేందుకు జిల్లా పోలీసులు సంబంధిత శాఖలతో సమన్వయంగా విస్తృత చర్యలు చేపట్టినట్టు  జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గత నెల మొదటి నుండి  31-07-2026 వరకు  జిల్లాలో మొత్తం 125 మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. వీరిలో 116 మంది...