ఆరెపల్లి ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు హాజరైన చెన్నూరు కోర్టు జడ్జి పార్వతపు రవి
భీమారం (మంచిర్యాల),అర్జున్ సమాచారం, జూలై 20: భీమారం మండలోని ఆరెపల్లి గ్రామ పంచాయతీ భవనంలో ఉచిత న్యాయ సలహా మరియు అవగాహన సదస్సు (న్యాయ విజ్ఞాన సదస్సు) అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు కోర్టు గౌరవనీయులైన జడ్జి శ్రీ పార్వతపు రవి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చిన్న చిన్న వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి న్యాయ సేవా అధికార...