ఆరోగ్యమే అసలైన ఆస్తి.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి! అర్జున్ సమాచారం ఎడిటర్ లింగం రాజయ్య పిలుపు..

అర్జున్ సమాచారం,జులై 11,మంచిర్యాల: మంచిర్యాల: ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అర్జున్ సమాచారం ఎడిటర్ లింగం రాజయ్య పిలుపునిచ్చారు. మారుతున్న జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడక, యోగా, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి చురుకుదనం లభించడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని తెలిపారు. వ్యాయామం...