ఆర్టీసీ డిపోను సందర్శించిన టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ సోలమన్, ఆర్‌ఎం రాజు ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు ఘన సన్మానం – ‘ప్రగతి చక్రం’పై ప్రత్యేక దిశానిర్దేశం – డిపో ఆవరణలో మొక్కలు నాటిన అధికారులు
గోదావరిఖని,అర్జున్ సమాచారం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) శ్రీ సోలమన్, కరీంనగర్ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం) రాజు బుధవారం సాయంత్రం గోదావరిఖని ఆర్టీసీ డిపోను సందర్శించారు. డిపో మేనేజర్ శ్రీమతి కవిత పుష్పగుచ్ఛం అందజేసి అధికారులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిపోలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించి, నగదు పురస్కారాలను అందజేశారు. సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను అధికారులు...