ఆర్థిక వృద్ధిలో రికార్డ్.. సెమీకండక్టర్ రంగంలో దూకుడు..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17,అర్జున్ సమాచారం: ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దేశంపై అంతర్జాతీయ విశ్వాసం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో చోటుచేసుకుంటున్న అభివృద్ధి దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గురువారం సెమీకాన్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. "ప్రపంచం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. ఇది...