ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు, అవసరమైన సామగ్రి పంపిణీ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత : జిల్లా కలెక్టర్ కే. హరిత
కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆగస్టు 27,అర్జున్ సమాచారం: : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి కే. హరిత సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, వసతి గృహ విద్యార్థులకు వివిధ ప్రోత్సాహకాలు, నిత్యావసర మరియు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. విద్యార్థులు మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని అధికారులు...