ఆసియా క్రీడలు: సెమీస్‌కు టీమిండియా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28,అర్జున్ సమాచారం: ఆసియా క్రీడల్లో భారత్, ఆఫ్ఘ‌నిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న టీమిండియా నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారుఉదయం 5:30 గంటలకు జరగాల్సిన పాకిస్థాన్-హాంకాంగ్ తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే కారణంతో రద్దయింది. ఆ మ్యాచ్‌లోనూ...