ఆ పోలీసులను గుర్తించండి డీజీపీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించండని డీజీపీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులపై తీసుకునే చర్యల రిపోర్టును స్పీకర్ ముందు ఉంచండని ఆదేశించింది. మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. =====================