ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 5:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ ,అర్జున్ సమాచారం :

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి గ్రామంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను బుధవారం అధికారులతో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి సకాలంలో పూర్తి చేయిస్తూ నివేదిక సమర్పించాలన్నారు.
నాణ్యత పాటిస్తూ గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మాణ పరిసరాలను కలియ తిరుగుతూ సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో షర్మిల, టీజీ ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
================================