ఇంద్రకీలాద్రి,అర్జున్ సమాచారం:
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజైన బుధవారం ఆశ్వయుజ శుద్ధ చవితినాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ మహాచండీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ ఏడాది కూడా
శరన్నవరాత్రుల్లో చండీదేవి అలంకరణ ప్రత్యేకం. జగజ్జననీ అయిన దుర్గామాత ఈ రోజున ఒక మెరుపు మెరిస్తే ఎంత వెలుగుగా ఉంటుందో అంతటి తేజోమయమైన రూపంతో అమ్మవారు సింహం
భుజములపై భీషణంగా కూర్చొని తన ఎనిమిది చేతుల యందు వివిధ రకాల ఆయుధాలను ధరించి రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్యమైన రూపంతో భక్తులను బంగారు రంగు
చీరలో సాక్షాత్కరిస్తుంది. చవితి పర్వదినం రోజున చండీ పారాయణం, చండీ యాగం చేస్తారు. చండీదేవిగా దర్శనమిచ్చే జగన్మాత కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా తెల్ల నువ్వులు కలిపిన బెల్లం పొంగలి,వడలు నివేదిస్తారు.
======================