ఇంపీరియల్ కాలేజీలో ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పర్యటన లండన్

లండన్,అర్జున్ సమాచారం: లండన్లోని ప్రతిష్ఠాత్మక ఇంపీరియల్ కాలేజీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం సలహాదారు, ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఇంపీరియల్ కాలేజీ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రలేషియా ప్రాంతాల సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రొసాన్నా గిల్లెస్పీతో ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విశిష్టతను, విద్యా రంగంలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. తెలంగాణతో కలిసి పని చేసేందుకు ఉన్న...