ఇక కౌశిక్ రెడ్డి వంతు

కరీంనగర్ సెప్టెంబర్ 26,అర్జున్ సమాచారం: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అస్త్రంగా చేసుకుని సుప్రీంకోర్టు దాకా న్యాయపోరాటం చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయించడంలో బీఆర్ఎస్ అధిష్ఠానం విజయం సాధించింది. ఇప్పటికి బీఆర్ఎస్ అధికారికంగా మూడు సీట్లను కోల్పోయింది. ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. మూడో ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యారు. మరో ఎమ్మెల్యేను కూడా తగ్గించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా అనర్హత అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఒకే దెబ్బకు రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు...