ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే. సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదు.. ముఖ్యమంత్రిని, విద్యుత్ శాఖ మంత్రిని: మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
సిద్దిపేట,అర్జున్ సమాచారం: గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో సాగునీరు, కరెంటు అందక ఎండిపోయిన వరి పంట పొలాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఈరోజు సందర్శించి పరిశీలించారు. చేతికొచ్చే దశలో ఎండిపోయిన పొలాలను చూపుతూ కన్నీరుమున్నీరైన బాధిత రైతులను ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్ల వానాకాలంలోనే దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు...