ఇరాన్ యుద్ధమే రిపబ్లికన్లను ముంచింది: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గతంలో మద్దతిచ్చిన ఓటర్లు డెమోక్రాట్లకు ఓటు వేయడం వల్లే ఓడామని విశ్లేషణ యుద్ధ నిర్ణయాన్ని సమర్థించుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెనేట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ డెమోక్రాట్లకు ఆధిక్యం రిపబ్లికన్ పార్టీలో ఓటమిపై మొదలైన అంతర్గత చర్చ

వాషింగ్టన్,అర్జున్ సమాచారం: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధమే ప్రధాన కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభిప్రాయపడ్డారు. గతంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన అనేకమంది ఓటర్లు ఈసారి డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ఆయన తన విశ్లేషణను సుదీర్ఘంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం తగ్గడం వల్ల తాము ఓడిపోలేదని, తమ మద్దతుదారులు ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయడమే అసలు సమస్య అని...