ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, రవాణా పై కఠిన చర్యలు అనుమతి పొందిన ప్రతి వాహనానికి విండ్‌స్క్రీన్‌పై పర్మిట్ తప్పనిసరి అక్రమాలకు పాల్పడితే రీచ్‌ల అనుమతులు రద్దు చేస్తాం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రెవెన్యూ, మైనింగ్ శాఖలతో సమన్వయంతో సంయుక్త దాడులు :జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు

తిరుపతి, జూలై 15,అర్జున్ సమాచారం: జిల్లాలో ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ మిని కాన్ఫిరెన్స్ హాలు నందు రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో ఇసుక, కంకర తవ్వకాల నియంత్రణ, అనుమతులు, రవాణా, పర్యవేక్షణ, అమలు చర్యలపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంయుక్తంగా సమీక్షా...