ఇసుక రవాణాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడుపై ప్రత్యేక దృష్టి హోల్డింగ్, పార్కింగ్ ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవాలి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తప్పవు

 అర్జున్ సమాచారం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలో పెరుగుతున్న ఇసుక రవాణా కారణంగా ప్రజలకు, ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఇసుక రవాణా, వాహనాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, అక్రమ ఇసుక రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక వాహనాల రాకపోకలు అధికంగా ఉన్న మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాల్లో...