ఈనెల 4న కరీంనగర్ కు అమిత్ షా రాక: పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్
కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలను ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 4న నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రతిమ డీమ్డ్ యూనివర్శిటీ భవన నిర్మాణ పనులకు అమిత్ షా చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన, కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలకు వచ్చారు. నగర పోలీస్ కమిషనర్...