ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 6:29 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఈ నెలాఖరున మంత్రివర్గ విస్తరణ

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 24 లేదా 25 తేదీల్లో కేబినెట్‌ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న 2 కేబినెట్ బెర్త్‌లను భర్తీ చేయడంతో పాటు కొందరి శాఖలనూ మార్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే అధిష్ఠానం పరిశీలిస్తున్న జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎం.రంగారెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.