హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు దశల వారీగా లక్ష ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ పథకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తులు, అమలు విధానం ప్రకటిస్తాం. తొలిదశలో నియోజకవర్గానికి 500-1000 వరకు ఎల్‌ఐజీ ఫ్లాట్లు. సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లలో స్థలాలు గుర్తించాం. 3 రోజుల్లో ఫ్లాట్ల విస్తీర్ణం, డిజైన్లను ప్రకటిస్తాంఅని వెల్లడించారు.