ఈ నెల 25న దర్శనం మరియు ఆర్జితసేవలు టికెట్లు విడుదల సెప్టెంబరు నెలకు సంబంధించి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు మరియు ఆర్జితసేవా టికెట్లు ఈ నెల 25న విడుదల రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ ద్వారా టికెట్లు పొందే అవకాశం ఏ.పి.టి.ఎస్ వారి వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా కూడా టికెట్లు పొందే సదుపాయం. టికెట్ల లభ్యతను బట్టి ఒక గంట ముందువరకు కూడా ఆర్జితసేవా టికెట్లు పొందే ఏర్పాటు – కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు

శ్రీశైలం.అర్జున్ సమాచారం: సెప్టెంబరు మాసానికి సంబంధించి  శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్రదర్శనం మరియు ఆర్జితసేవాటికెట్లను  రేపు (25.08.2026) విడుదల చేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు సులభంగా ఆయా  టికెట్లు  పొందేందుకు వీలుగా 90శాతం టికెట్లను  రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించడం జరుగుతోందన్నారు. మిగిలిన 10 శాతం టికెట్లను ఏ.పి.టి.ఎస్ వారి వెబ్‌సైట్ www.tms.ap.gov.in  ద్వారా పొందవచ్చునని అన్నారు. అలాగే పరోక్షసేవాటికెట్లను కూడా మనమిత్ర వాట్సప్ మరియు ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చునన్నారు. శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో...