ఉద్యోగులారా మీరు చేసే యుద్దంలో మేమే ముందుంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్,అర్జున్ సమాచారం: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రాఫర్లను సన్మానించిన కేంద్ర మంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఈనెల 27 నుండి ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన పోరుబాటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే యుద్దంలో బీజేపీ సైనికులే ముందుండి పోరాడేందుకు సిద్ధమన్నారు. ఈ యుద్దంలో మీ కంటే ముందు మేమే ఉంటాం. పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే ఆ దెబ్బలు మేమే తింటాం. తూటాలు పేలిస్తే ఆ తూటాలకు మేమే...